రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:సుంకరి

సూర్యాపేట జిల్లా:యాసంగిలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అనేక కారణాలతో వరి పంట పండకుండా కోయటానికి వీలులేకుండా పూర్తిగా నష్టపోయిన రైతులను రెవెన్యూ అధికారులు గుర్తించి,ఆదుకోవాలని సామాజిక కార్యకర్త,మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.

బుధవారం నేరేడుచర్ల మండలంలోని బక్కయ్యగూడెం,మేడారం,పెంచికల్ దీన్నే,కమలానగర్ లలో పంటను కోయకుండా పూర్తిగా వదిలివేసి నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగి పంటలో కొంతమంది రైతులు పర్యావరణ కారణాలతో పంట నష్టం జరిగి 20 బస్తాల దిగుబడి వచ్చి రైతులు,కౌలు రైతులు తీవ్రనష్టాలు చవిచూడగా ప్రస్తుత రబీలో పంటకోత కూళ్లు కూడా రావని వదిలేసిన పంటలతో తీవ్రంగా నష్టపోయారని,అలాంటి రైతులను వెంటనే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించి,రైతులను ఆదుకోవాలని కోరారు.

Government Should Support Farmers: Sunkari-రైతులను ప్రభు
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం.. అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న నాగబాబు... స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరు!

Latest Suryapet News