నిరుద్యోగులకు గుడ్ న్యూస్: భారీ సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించనున్న ఇ-కామ్ ఎక్స్‌ప్రెస్...!

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయిన వారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దీనితో అనేక దేశాలలో నిరుద్యోగ రేటు అమాంతం తారస్థాయికి చేరుకుంది.

 Good News For Unempolyees Ecom Express Is Hiring  Ecom Express, Couriers, Festiv-TeluguStop.com

ఇక మన భారతదేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారులు చతికిలపడడంతో అనేక కంపెనీలు వారి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించారు.

ప్రస్తుతం దేశంలో అన్ లాక్ విధానం మొదలైన తర్వాత సంస్థలు తిరిగి ప్రారంభించడంతో కొద్దికొద్దిగా సంస్థలోకి ఉద్యోగస్తులను చేర్చుకుంటున్నారు.

ఇంకా తాజాగా నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది ఈ కామ్ ఎక్స్ ప్రెస్.

కొద్దిరోజుల్లో మొదలు కాబోయే ఫెస్టివల్ సేల్స్ దృష్టిలో ఉంచుకొని భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని లాజిస్టిక్స్ సంబంధించిన ఈ కాం ఎక్స్ ప్రెస్ భారీగా ఉద్యోగాలను కల్పించబోతుంది.ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కొన్ని సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను చేర్చుకున్న సంగతి విదితమే.

ఇక పండుగ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్ దిగ్గజ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్ర, పేటీఎం లాంటి సంస్థలు ఫెస్టివల్ సేల్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి డెలివరీ లను చేసేందుకు అనేక మంది ఉద్యోగులను నియమించుకబోతుంది ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ ఈ కామ్ ఎక్స్ ప్రెస్.

ఆన్లైన్ దిగ్గజ కంపెనీలు వారి డెలివరీల కోసం లాజిస్టిక్ కంపెనీలను ఆశ్రయిస్తున్నాయి.

ముఖ్యంగా పండుగల సీజన్ నేపథ్యంలో డెలివరీలు ఎక్కువగా ఉంటాయి.ఇక ఈ పరిస్థితులను ముందుగా దృష్టిలో ఉంచుకొని 30 వేల ఉద్యోగాలను ప్రకటించింది ఈ కామ్ ఎక్స్ ప్రెస్.

కాకపోతే, ఈ ఉద్యోగాలు కేవలం ఫెస్టివల్ సీజన్ వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.అంటే ఇవి కేవలం తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే.

ఇప్పటివరకు ఈ కామ్ ఎక్స్ ప్రెస్ కేవలం 23 వేల మంది పని చేస్తుండగా… కరోనా వైరస్ పరిస్థితి ఏర్పడ్డాక ఆన్లైన్ ఆర్డర్స్ పెరగడంతో దీంతో మరో 7 వేలకు పైగా ఉద్యోగస్తులను నియమించుకుంది.ఇకపోతే రాబోయే నెలల్లో పెద్ద పండుగలు ఉన్న నేపథ్యంలో భారీగా ఆర్డర్స్ వస్తాయన్న ఉద్దేశంతో మరో 30వేల తాత్కాలిక ఉద్యోగులను నియమించబోతుంది ఈ కామ్ ఎక్స్ ప్రెస్.

ఇందుకు సంబంధించి అక్టోబర్ 15 నుండి నియామక ప్రక్రియను చేయబోతోంది కంపెనీ.ఈ ఉద్యోగస్తుల నియామకాల్లో ఫ్రెషర్స్, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరికీ ఉద్యోగాలు కల్పించబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube