టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

నల్లగొండ:పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ మేరకు పదవ తరగతి విద్యార్థులు ప్రస్తుతం కలిగి ఉన్న బస్ పాస్ వ్యాలిడిటీని జూన్ 1 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు తమ బస్ పాస్ తో పాటు హాల్ టికెట్ చూపించి పరీక్షల రోజుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రం,అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేయవచ్చని వివరించారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Good News For Tent Students-టెన్త్ విద్యార్థుల
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News