మూలవిరాట్ వక్షస్థలంపై స్వర్ణలక్ష్మిని ఎవరు ప్రతిష్టించారు?

తిరుమల గిరుల్లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి రోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొంటారు.

 Goddess Vakula Mahalakshmi Importance And Significance In Tirumala Srivari-templ-TeluguStop.com

ఇప్పటికే ఈ ఆలయం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము.అయితే ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామి వారి మూలవిరాట్ వక్షస్థలంపై స్వర్ణ లక్ష్మి ఉన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు.

ఇలా స్వామివారి వక్షస్థలం పై ఉన్నటువంటి స్వర్ణలక్ష్మి ని వ్యూహ లక్ష్మి అని కూడా పిలుస్తారు.అయితే ఈ స్వర్ణ లక్ష్మినీ ఎవరు ప్రతిష్టించారు ఈ స్వర్ణలక్ష్మి విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

స్వామి వారి మూల విరాట్ వక్షస్థలంపై స్వర్ణలక్ష్మి విగ్రహాన్ని భగవత్ రామానుజుల వారు ప్రతిష్టించారు.ఈ స్వామి సాక్షాత్తు వెంకట నాథుడు ఈ భూమి పై కొలువై ఉన్నారనీ,స్వామివారికి శంకు, చక్రాలను పచ్చకర్పూరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి వక్షస్థలంపై స్వర్ణ లక్ష్మినీ ప్రతిష్టించారు.

అమ్మవారు స్వామివారి వక్షస్థలంపై ఉండటం వల్ల ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం స్వామి వారికి కూడా అభిషేకం చేసి అమ్మవారిని మంగళసూత్రంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Telugu Goddess Vakula, Swarna Lakshmi, Tirumalasrivari-Telugu Bhakthi

ఇలా స్వామివారి వక్షస్థలంపై మహాలక్ష్మి ఉండటంవల్ల ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.అలాగే అమ్మవారు స్వామివారి వక్షస్థలంపై కొలువై ఉండడంతో ప్రపంచంలో ఏ ఆలయానికి లేనంత ధన, జన ఆకర్షణ తిరుమల ఆలయానికి ఉంది.ఇలా వ్యూహ లక్ష్మిగా స్వామివారి వక్షస్థలం పై ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి.

ఈ వ్యూహ లక్ష్మిని స్వర్ణలక్ష్మి అని కూడా పిలుస్తారని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube