పొలాల్లో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ...టెన్సన్ లో రైతులు

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం( Anantha Giri ) గోండ్రియాల గ్రామ శివారులో ఉన్న పంట పొలాల నుండి వెళుతున్న గ్యాస్ పైప్ లైన్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాలేరు వాగు ఉధృతికి మట్టి కొట్టుకుపోయి గ్యాస్ పైపులు తేలి,గ్యాస్ లీక్ కావడంతో పంటలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట పొలాల్లో కూలి పనులకు వచ్చే కూలీలు,ట్రాక్టర్,జేసీబీ యాజమానులు పనులకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని,దీనితో పంట వేసుకోవడానికి ఇబ్బందిగా మారిందని, గ్యాస్ లీకేజీ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొలాల వద్దకు రావాలంటే భయంగా ఉంటుందని వాపోతున్నారు.

పైకి తేలిన పైప్ లైన్ నుండి గ్యాస్ లీకేజీ అవుతున్నా సంబంధిత గుత్తేదారులు ఏమాత్రం పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని, అధికారులు కూడా స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకైన పైపులను మరమత్తులు చేసి,గ్యాస్ లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నూతనకల్ పోలీసులు పిడిఎస్ బియ్యం పట్టివేత

Latest Suryapet News