గ్యాంబ్లింగ్, బెట్టింగ్, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్యాంబ్లింగ్, బెట్టింగ్, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

- సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద బోనాల గ్రామ శివారులో పేకాట స్థావరం పై పోలిసుల ఆకస్మిక దాడిచేసి -౦7 గురిని అరెస్ట్,చేసి వారి వద్ద నుండి 1,26,890/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సులభ సంపాదనకు అలవాటుపడి కొంతమంది ఈ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతు ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నా,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో నిత్యం టాస్క్ఫోర్స్, పోలీస్ ల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై నిఘా ఏర్పాటు తనిఖీలు నిరహిస్తామని ఎవరైన, గ్యాంబ్లింగ్, బెట్టింగులకు కానీ, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.మీ ప్రాంతంలో ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నవి తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు .ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దబోనాల గ్రామ శివారులో ఒక ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారం మేరకు సిరిసిల్ల టౌన్ సి.ఐ అనిల్ కుమార్ తన సిబ్బంది తో పేకాట స్థావరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న 07 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 1,26,890/-రూపాయల నగదు స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.పేకాట ఆడుతున్న తాళ్ల తిరుపతి పెద్దురు , ఈర్నాల సారయ్య చీర్లవంచ, గుగ్గిళ్ల రాజు పెద్దురు , చల్ల శోభన్ బాబు, పెద్దురు , చల్ల సతీష్, పెద్దురు , చల్ల భిక్షపతి, పెద్దురు , సాల్లూరి నర్సయ్య, పెద్దురు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Latest Rajanna Sircilla News