ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వానికి ఉత్సవాలు నిర్వహించే నైతిక హక్కు లేదు: సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా

దశాబ్ది ఉత్సవాల పేరుతో ఆర్భాటాలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కెసిఆర్ కు ఉత్సవాలు నిర్వహించే నైతిక అర్హత లేదని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వానికి ఆ హక్కు లేదని ప్రజా పంథా పార్టీ ఖమ్మం నగర కార్యదర్శి కామ్రేడ్ ఝూన్సి, POW రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సిచ్ శిరోమణి అన్నారు.ప్రజాపంథా రాష్ట్ర ఏడవ మహాసభ పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల లో ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసిందని నిరుద్యోగాన్ని పెంచిందని ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని చెప్పిన కేసీఆర్ క్రమబద్దీకరణ చేయడంలో విఫలమయ్యాడని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడంలో కెసిఆర్ మోసం చేశాడని రైతులకు రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని మోసం చేశాడని పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నాడని అర్హులైనటువంటి వారందరికీ రేషన్ కార్డు ఇవ్వడంలో విఫలమయ్యాడని నిరుద్యోగుల అందరికీ జీవన భృతి అందించడంలో విఫలమయ్యాడని

 A Government That Does Not Fulfill People Aspirations Has No Moral Right To Orga-TeluguStop.com

ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరుస్తానని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని హామీల ప్రభుత్వంగా మారిందని నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగిందని రాష్ట్ర సాధన ఉద్యమంలో సబ్బండ వర్గాలు పాల్గొన్నాయని తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు కన్నీళ్లు ప్రజలకు మిగిలాయని రాజ భోగాలు కేసీఆర్ కుటుంబానికి మిగిలాయని అందినంత తెలంగాణ సంపద దోచుకున్నారని బంగారు తెలంగాణ ఏమో కానీ కెసిఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని అన్నారు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాన్ని ఉదృతం చేయాలని అన్ని వర్గాల ప్రజల్ని కోరారు దీక్ష దివస్ సందర్భంగా 12వ తారీకు రోజున ఖమ్మం జిల్లా కేంద్రంలో దీక్ష దివస్ను నిర్వహిస్తున్నామని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో IFTU ఖమ్మం ఏరియా కార్యదర్శి కొయ్యల శ్రీనివాస్ PYL ఖమ్మం నగర కార్యదర్శి కామ్రేడ్ ఛందు పార్టీ నాయకులు లక్ష్మి నారాయణ రామనాధం తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube