ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం భేష్...!

నల్లగొండ జిల్లా:గ్రామాల్లో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు.

ఆదివారం పెద్దవూర మండలంలోని నాయినివాణి కుంట గ్రామంలో ఆల్విన్ పౌండషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఎడమ కాలువ మాజీ ఛైర్మెన్ మలిగిరెడ్డి లింగారెడ్డితో కలిసి ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లడుతూ వాతావరణ పరిస్థితుల కారణంగా మండలంలో మలేరియా,టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాదులు వస్తుండడంతో ప్రజల ఆరోగ్య సౌకర్యార్థం ఆల్విన్ పౌండషన్ వారు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించి,5 రకాల రక్త పరీక్షలు,బీపీ,షుగర్,గైనకాలజీ,ఆర్థో,ఈఎన్టీ,ఎక్సరే తదితర పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమకారులు,యువజన కాంగ్రెస్ నాయకులు వాసికర్ల వినయ్ రెడ్డి బ్రదర్స్ చేస్తున్న ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,తెలంగాణ బంజారా,ఆదివాసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ శంకర్ నాయక్,వాసికర్ల విక్రమ్ రెడ్డి,మూల శేఖర్ రెడ్డి,అల్విన్ పౌండేషన్ ఛైర్మెన్ బహదూర్ షా, డాక్టర్లు కరీముల్లా,కిషన్, రఘుతేజ,చంద్రమౌళి, గ్రామస్థులు పాల్గొన్నారు.

వెటర్నరీ పోస్టుల్లో మహిళలకు రిజర్వేషన్లు
Advertisement

Latest Nalgonda News