సూర్యాపేట జిల్లాలో మూడు రోజులు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్...!

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ నందు ఈ నెల 8 నుండి10 వరకు మూడు రోజులు పాటు మృగశిర కార్తెను( Mrigashira Karthe ) పురస్కరించుకొని చేపలు, రొయ్యల ఆహార పండగ నిర్వహించడం జరుగుతుందని జిల్లా మత్యశాఖ అధికారి టి.

రూపేందర్ సింగ్ ( T.

Rupender Singh )గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 8 న కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు, మత్స్యకారులు పాల్గొంటారని,పుర ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.ఈ మూడు రోజులు సందర్శకులకు రుచికరమైన చేపల వంటకాలు,రొయ్యల బిర్యానీలు,చేపల వేపుడు, చేప పకోడాలు,పచ్చళ్ళు, వడలు అలాగే ఇతర వంటకాల ప్రదర్శన, విక్రయం చేపట్టనున్నట్లు భోజన ప్రియులు తప్పక సందర్శించాలన్నారు.

అదే విధంగా చేపలు,రొయ్యల వంటకాల్లో అనుభవం ఉన్నవారు స్టాల్ ఏర్పాటు చేయదలిస్తే జిల్లా మత్స్య శాఖ కార్యాలయం యందు సంప్రదించగలరని,ఇతర వివరాలకు9502823878 నెంబర్ కి సంప్రదించాలని తెలిపారు.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

Latest Suryapet News