లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్(Kamal Hassan) టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇండియన్ 2(Indian 2).భారతీయుడు సినిమాకి సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చినా కూడా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
అయితే అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్(Siddharth) కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక గొప్ప సినిమా అవుతుందని తెలిపారు.శంకర్ వంటి ఓ గొప్ప దర్శకుడి దగ్గర 20 సంవత్సరాలు తర్వాత సినిమా చేయడం నిజంగా నా అదృష్టం అని భావిస్తున్నానని సిద్ధార్థ్ తెలిపారు.ఇక కమల్ హాసన్ నాకు ఎంతో ఇష్టమైన హీరో అని తెలిపారు.

కమల్ హాసన్ గారు తనకు ఇష్టమైన హీరో మాత్రమే కాకుండా ఆయన నా మానసిక గురువు అని తెలిపారు.దూరం నుంచి తాను కమల్ హాసన్ గారిని చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నానని నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడనని సిద్ధార్థ్ తెలిపారు.ఇలా నా గురువు గారితో కలిసి నేను సినిమా చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని కమల్ హాసన్ గారితో కలిసి సినిమా చేయడమే నా కల అని ఈ సినిమాతో ఆ కల నెరవేరిందని సిద్ధార్థ్ తెలిపారు.ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ మీరు ఈ సినిమా గురించి ఎంత ఊహించకున్నా మీ ఊహాలకు మించి ఇండియన్ 2 సినిమా ఉండబోతుందని సిద్ధార్థ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.