తల్లిని రాచిరంపాన పెడుతున్న కొడుకులు ఉన్న ఈ సమాజంలో కన్న తల్లి కోసం ఆ కొడుకు ఏకంగా తండ్రినే జైలుకు పంపిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది.ఆ వివరాలు చూస్తే.
చౌబెపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తాఫాబాద్‌లో జయప్రకాష్ సింగ్(42) అనే వ్యక్తి తరచూ తన భార్యతో గొడవ పడుతూ, ఆమెపై దౌర్జన్యానికి దిగుతుండే వాడట.ఆ సమయంలో వారి కొడుకు తల్లిదండ్రుల గొడవలను ఆపేందుకు ప్రయత్నం చేయగా ఆ తండ్రి కర్కోటకుడిలా ప్రవర్తిస్తూ కొడుకుపైన కూడా చేయి చేసుకోవడమే కాకుండా చంపేస్తానని బెదిరింపులకు దిగే వాడట.
ఇలా చాలకాలం నుండి జరుగుతుండగా ఓపిక నశించిన ఆ కొడుకు చివరికి తన తండ్రి దురాగతాల గురించి పోలీసులకు ఫోను చేసి చెప్పాడట.దీంతో స్పందించిన పోలీసులు కుమారుని ఫిర్యాదు మేరకు తండ్రిపై కేసు నమోదు చేశారు.
ఇక విషయం తెలుసుకున్న ఆ తండ్రి పరారీలో ఉన్నాడట.అతనికోసం తీవ్రంగా గాలించిన పోలీసులు తుదకు జయప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారట.అలాగే అతని నుంచి పలు మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.