గురువారం ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించండి!

గురువారం చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తూ ఆ దేవ దేవతలను ప్రసన్నం చేసుకుంటారు.

అయితే కొందరు ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండటమే అని భావిస్తూ ఉంటారు.

అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.ఉపవాసం చేస్తే ఉపవాస నియమాలను పాటిస్తూ, మన ధ్యాస మొత్తం ఆ భగవంతుడి మీద పెట్టి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలను కలిగిస్తుంది.

గురువారం రోజున ఏ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి.ఆ ఉపవాస నియమాలు ఎలా పాటించాలనేది తెలుసుకుందాం.

గురువారం గురుగ్రహం లేదా బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు.గురువారం రోజున గుడికి వెళ్లి పూజ చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగి అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

Advertisement

ముందుగా గురునికి నేటితో అభిషేకం చేయాలి.గురునికి పసుపు రంగు ఎంతో ప్రీతికరమైనది.

తదుపరి పసుపుతో అభిషేకం చేసి ఎంతో ఇష్టమైన శెనగలను నైవేద్యంగా సమర్పించవలెను.అలాగే కొద్దిగా శెనగలను పసుపు రంగు వస్త్రంలో కట్టి స్వామి వారికి సమర్పించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

గురువారం రోజున ఉపవాస దీక్షలు చేసే వారు పసుపు రంగు దుస్తులను ధరించి ఉపవాసం చేయాలి.ఆ మహా విష్ణువు ఫోటో తీసుకొని పూజ చేసి ఉపవాస దీక్షలు ప్రారంభించాలి.

ముందుగా స్వామి వారి ఫోటోలు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద ఫోటోను పెట్టి పూజను ప్రారంభించాలి.స్వామి వారికి పసుపు రంగు పూలతో పూజ చేయాలి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలను కలగజేస్తుంది.స్వామివారికి నైవేద్యంగా శనగలను సమర్పించవలెను లేదా పసుపు రంగుతో ఉండే మిఠాయిలను సమర్పించాలి ఈ నైవేద్యాన్ని కుటుంబం మొత్తం తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

Advertisement

గురువారం రోజున తలస్నానం చేయకూడదు అలాగే ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు ఇలా చేయడం ద్వారా మీరు చేసిన ఉపవాస దీక్షకు మంచి ఫలితం ఉంటుంది.చివరిగా స్వామివారిని కథ వినడం ద్వారా లేదా చదవడంతో ఉపవాస దీక్షను విరమించాలి.

గురువారం రోజున అరటి చెట్టు మొదలు దగ్గర పసుపు నీళ్లు చల్లి నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.అలాగే గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిది.

తాజా వార్తలు