గుర్రంతండా ఐకెపి కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం గుర్రంతండా ఐకెపిలో గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేస్తలేదని మంగళవారం ఉదయం సూర్యాపేట-దంతాలపల్లి జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వడ్లకు నిప్పంటించి నిరసన తెలిపారు.

ఐకెపి సెంటర్ నిర్వాహకులు,మండల అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Latest Suryapet News