తెలంగాణలో మతోన్మాదులకు స్థానం లేదు:తమ్మినేని వీరభద్రం

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదులకు స్థానం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర కోదాడకు వచ్చిన సందర్భంగా రంగా థియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నల్లధనం తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన నరేంద్ర మోడీ, అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా నల్లధనం దేశానికి తీసుకురాలేదన్నారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.మోడీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపుతుందన్నారు.

Fanatics Have No Place In Langana: Tammineni Veerabharam-తెలంగాణ�

దేశమంటే అంబానీ, అదానీల తొత్తుగా బీజేపీ ప్రభుత్వం మార్చివేసిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్, నూనెల ధరలు మూడు రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందన్నారు.ఒకే భాష పేరుతో హిందీ, సంస్కృతాన్ని ప్రజలపై రుద్దుతున్నారన్నారు.

Advertisement

విద్యలో జ్యోతిష్యాన్ని , సంస్కృతాన్ని పాఠ్యాంశాలు మార్చారని అన్నారు.రాజ్యాంగ యంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.తినే తిండిపై,వేసుకునే బట్టలపై ఆధిపత్యం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటుందని ఆ కలలను కల్లలు చేసే సత్తా రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఉందన్నారు.అంతకుముందు శాంతినగర్ నుండి కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.

సిపిఎం పట్టణ కార్యదర్శి మిట్టకడుపుల ముత్యాలు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి,సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,నెమ్మాది వెంకటేశ్వర్లు,మట్టిపెళ్లి సైదులు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి,దాసరి శ్రీనివాస్, కిషోర్,వెంకన్న,రెహమాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

బిగ్ బాస్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది... ఎన్టీర్ మాట వినాల్సింది : సంపూర్ణేష్ బాబు 
Advertisement

Latest Suryapet News