ఉమ్మడి మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ లో కులపెద్దల ముర్ఖత్వానికి ఒక నిండు ప్రాణం బలి అయ్యింది.ఆ వివరాలు తెలుసుకుంటే.
గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ ని ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు.అయితే కేసు నమోదు కాగానే శంకర్ కుటుంబం మొత్తాన్ని ఆ గ్రామానికి చెందిన కులస్తులు కులబహిష్కరణ చేశారు.ఇదే సమయంలో కోర్టు శంకర్ ను నిర్ధోషి అని తేల్చింది.కాగా కులం నుండి బహిష్కరించిన పెద్దల దగ్గరికి వెళ్లి తనను కులంలో చేర్చుకోమని అడగ్గా అందుకు రూ.5 లక్షలు చెల్లిస్తే కులంలో కలుపుకుంటామనే నిబంధన పెట్టారు.దీంతో అంత భారీ మొత్తం కట్టలేని స్థితిలో ఉన్న శంకర్ జనవరి 6న అల్లదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.తమ కుల పెద్దలు కావాలనే తమను కుల బహిష్కరణ చేశారని పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శంకర్ అర్ధరాత్రి తమ వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కులపెద్దల మూర్ఖత్వం వల్ల ఒక కుటుంబం తన వారిని కోల్పోవలసి వచ్చింది.
పనికి రాని ఇలాంటి ఆచారాలు మనిషి చావడానికి ఊపయోగపడతాయని నిరూపించింది ఈ ఘటన.