రఘువీర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి:మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా( Suryapet District):లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి,ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Ram Reddy Damodar Reddy ) అన్నారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని మహ్మదాపురం, చీదేళ్ళ,మేగ్యతండా,ధర్మపురం,భక్తలాపురం గ్రామాల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటినుండి కుల,మతాలకు అతీతంగా అణగారిన ప్రజల అభ్యున్నతికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు .నీళ్లు,నిధులు,నియామకాల సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ,( BRS Party )తన స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అప్పజెప్పి,రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిదని ఆరోపించారు.అదే విధంగా దేశంలో మతం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆర్థిక నేరగాళ్ళకు అండగా ఉంటూ ఒక్కరిద్దరిని ప్రపంచ కుబేరులుగా చేసి,దేశంలోని యువతను,రైతులను, అణగారిన పేదలను గాలికొదిలేసిందన్నారు.

ఈ కార్యక్రమం వేనారెడ్డి,మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు,సముద్రల రాంబాబు, గజ్జెల సైదిరెడ్డి,మండల,గ్రామ శాఖ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News