తెలంగాణా భవిష్యత్ ను మార్చేది మునుగోడు ఎన్నికే

నల్లగొండ జిల్లా:మునుగోడు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్ ను మార్చే ఎన్నికని,ప్రజలు అన్ని విధాలా సిద్ధమై ఉన్నారని అన్నారు.

కేసీఆర్ ఉద్యమకారులని అడుగడుగునా అవమానించారని,దానికి ప్రత్యక్ష సాక్షి ఈటెల రాజేందర్ అని అన్నారు.హుజురాబాద్ లో ధర్మం యుద్ధం ఎలా జరిగిందో అంతకు పదిరేట్లు మునుగోడు లో జరగబోతుందన్నారు.

Elections Will Change The Future Of Telangana-తెలంగాణా భవి

తెలంగాణా ద్రోహులందరిని పక్కకి పెట్టుకొని నేడు కేసీఆర్ పరిపాలన చేస్తున్నాడన్నారు.నా రాజీనామా మునుగోడు ప్రజలందరి చేతిలో ఉన్న ఒక గొప్ప బ్రాహ్మస్త్రం,నేడు యువతని మద్యం మత్తులో ముంచుతున్నారని,తెలంగాణా రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని,ఈ రాష్ట్రాన్ని దుర్మార్గ పాలన నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ మహా ధర్మయుద్ధంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.

Advertisement
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News