ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ షురూ...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగి, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికార యంత్రాగం ఎన్నికల నిబంధనలు అమలు చేయడం మొదలుపెట్టింది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తూ,పార్టీల దిమ్మెలకు రంగులు పూస్తూ,నేతల ఫ్లెక్సీలు తొలగిస్తూ, పొలిటికల్ వాల్ రైటింగ్స్ సున్నంతో చెరిపేస్తూ ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

దీని కొరకు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్,గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ సిబ్బందిని రంగంలోకి దింపారు.ఈ నేపథ్యంలో అక్కడక్కడా అధికార పార్టీకి చెందిన వాటిపై దృష్టి సారించండం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు గరమవుతున్నరు.

Elections Code Effect In Nalgonda District, Elections Code , Nalgonda District,

అధికారుల మాత్రం ఎన్నికల కోడ్ అందరికీ ఒకేలా వర్తిస్తుందని,అన్ని పార్టీలపై ఓకే విధమైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు.ఇక ఇప్పటికే పోలీసు నిఘా నేత్రం తమ పనిని షురూ చేసింది.

రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి,అన్ని మార్గాల నుండి వస్తున్న వాహనాల తనిఖీలు ముమ్మరం చేసింది.ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఆధారాలు లేకుండా రవాణా చేస్తున్న నగదును లక్షల్లో సిజ్ చేసింది.ఎవరైనా రూ.50వేలకు మించి తీసుకపోవద్దని, తప్పని సరి అయితే తప్పకుండా దానికి సంబంధంచిన పూర్తి ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని పోలీస్ శాఖ సూచిస్తుంది.

Advertisement
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News