కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి:హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి

సూర్యాపేట జిల్లా:కేసుల సత్వర పరిష్కారానికి,ప్రజలకు న్యాయ సేవలు అందించేలా న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి( RADHA RANI ) అన్నారు.

సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టును ఆమె సందర్శించగా పోలీసులు న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ న్యాయ సేవలు ప్రజలకు చేరువయ్యే విధంగా కోర్టులు పని చేస్తున్నాయన్నారు.న్యాయమూర్తి, న్యాయవాదులు సమన్వయంతో పని చేస్తూ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా కోర్టులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కోర్టు భవనం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.

త్వరలో నూతన భవనానికి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా జడ్జి రాజగోపాల్( Rajagopal ), తుంగతుర్తి జడ్జి రాచర్ల శాలినీ,కోర్టు సూపరింటెండెంట్ ఉమా( Uma ), సీనియర్ అసిస్టెంట్ పద్మ, అంజయ్య,త్రిశూల్,సర్కిల్ సీఐలు,ఎస్సైలు,పోలీస్ సిబ్బంది,న్యాయవాదులు కుమారస్వామి, సత్యనారాయణ,జ్ఞాన సుందర్,చంద్రమౌళి,పూల్ .

Advertisement
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News