విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి:ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్

సూర్యాపేట జిల్లా: సమాజంలో విద్య పాత్ర చాలా ప్రముఖమైనదని, అన్ని వర్గాలకు విద్య అందినప్పుడు విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు( Konda Nageswara Rao ) అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోపి.

డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా( Suryapet District ) కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పోలబోయిన కిరణ్ అధ్యక్షతన "కేసీఅర్ 9 ఏళ్ల పాలనలో విద్యారంగ పరిస్థితులు" అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ నేటి పాలకులు విద్యను బడుగు బలహీన వర్గాలకు అందనివ్వకుండా ప్రైవేట్, కార్పొరేట్ వశం చేస్తున్నారని తెలిపారు.పేద విద్యార్థులు చదువుకునే 9 వేల ప్రభుత్వ పాఠశాలలు నేడు మూతబడినవని,ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సమస్యలతో సతమతం అవుతున్నాయని,కనీసం టాయిలెట్స్ నిర్మించలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

నేడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఉస్మానియా,కాకతీయ, శాతవాహన,జేఎన్టీయూ లాంటివి నిధులు లేక వెంటిలేషన్ పై ఉన్నాయన్నారు./br తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యపై శ్రద్ధ లేదన్నారు.

ప్రవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేసిందన్నారు.సీఎం కేసీఆర్( CM KCR ) వెంటనే స్పందించి రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థల నిషేధించాలని,ప్రభుత్వ విద్యాసంస్థల పరిరక్షణకై నడుము కట్టాలని సూచించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి ఎం.చందర్ రావు,జిల్లా నాయకులు పుల్లూరి సింహాద్రి,డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, రహీం,గౌతమి,మనోజ్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ
Advertisement

Latest Suryapet News