ఈడబ్యూఎస్ ను రద్దు చేయాలి:డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్

సూర్యాపేట జిల్లా: త్వరలోనే సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రంలో లక్ష మందితో బహుజన మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్ లో శ్రీనిధి జూనియర్ కళాశాలలో జన సేవా సమితి ఆధ్వర్యంలో తగుళ్ళ జనార్ధన్ యాదవ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ప్రముఖ డాక్టర్ వూర రామూర్తి యాదవ్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడుతూ సమగ్ర కుల గణన వెంటనే చేయాలని,బీసీ కమిషన్ వెంటనే విధివిధానాలు మీడియా ద్వారా విడుదల చేయాలని,బహుజనుల సమస్యలు రోజురోజుకు అధికమైపోతున్నాయన్నారు.ఇవన్నీ తగ్గాలంటే గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే బంద్ చేయించాలని,ఈడబ్యూఎస్ ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ,ఓసీల లో ఉన్న పేదలకు అన్యాయం జరుగుతుందని,ఈ అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈడబ్యూఎస్ ను రద్దు చేయాలని,సమగ్ర కుల గణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరం తగుల జనార్దన్ మాట్లాడుతూ సమగ్ర కుల గణన న్యాయబద్ధంగా త్వరగా జరగాలన్నారు.బహుజనులు చైతన్యవంతులవుతున్నారని,రానున్న రోజుల్లో మనమే రాజ్యాలను పరిపాలించే అవకాశం ఉందని,అందుకే బహుజనులు రాజ్య విద్యలు నేర్చుకోవాలని, త్వరలో జిల్లా కేంద్రం జరగబోయే సభకు బహుజనులు తండోపతండాలుగా తరలివచ్చి మహాసభను విజయవంతం చేసి, బహుజన చైతన్యాన్ని, మేదస్సును ఈ అగ్రవర్ణాలకుతెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈకార్యక్రమంలో అఖిలపక్ష నేతలు ధరావత్ నాగేందర్ నాయక్,లంబాడ హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ ఉద్యమకారుడు గుండాల సందీప్,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు వీరన్న యాదవ్,ఆర్వీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చామకూరి మహేందర్, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చిపాల ఎల్లేష్,బీసీ విద్యార్థి సంఘం పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు దుబాని మల్లేష్,నాగరాజ్,సాయి, మహేష్,గోవర్ధన్,రాజు, వీరబాబు,నాగు,రవి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఒక్కరోజు జైలు జీవితం బన్నీని భయపెట్టిందా.. ఇకపై ఆ తప్పు అస్సలు చెయ్యరా?

Latest Suryapet News