సూర్య గ్రహణం కారణంగా కలియుగ వైకుంఠం అయిన తిరుమల శ్రీవారి ఆలయం మూతపడుతున్నాయి.నేడు సూర్యగ్రహణం మధ్యాహ్నం ప్రారంభం కానుండటంతో,పరిగణించింది గ్రహణానికి ఆరు గంటల ముందు నుండే సూతక కాలం గా పరిగణించి ఆలయాలను మూసివేస్తారు.
ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. ఉదయం ఎనిమిది గంటల 11నిమిషాలకు మూతపడింది.
ఈరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయం మూసివేత కొనసాగుతుంది.అంటే మొత్తం 12 గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసి వేస్తున్నారు.
అక్టోబర్ 24న సిఫార్సు లేఖలను అనుమతించలేదు.అక్టోబర్ 25 మంగళవారం నేడు సూర్య గ్రహణం కారణంగా ఆలయం మూసివేత కొనసాగుతుండడంతో టీటీడీ అధికారులు బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తోపాటు, అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్ లను కూడా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.ఇక సూర్య గ్రహణం కారణంగా 18 గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నారు.
గ్రహణం విడిచిన తర్వాత పుణ్యాహవచనం, ఆలయ శుద్ధి నిర్వహించి, అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, రాత్రి తొమ్మిది గంటల నుండి భక్తులను స్వామి దర్శనం కోసం అనుమతిస్తారు.