మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రమాదం: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలని, వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, మహిళలను కించపరచకుండా ప్రమాదాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని,31వ తేది రాత్రి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని,మద్యం తాగి ఎవరు రోడ్లపైకి రావద్దని,న్యూసెన్స్ చేసినా,ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా అలాంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మద్యంతాగి వాహనాలు నడపవద్దని,బైక్ రేసింగ్ లు నిర్వహించవద్దని,ట్రిబుల్ రైడింగ్,రాంగ్ రూట్ డ్రైవింగ్,హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం ప్రమాదమని,వీటిని ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు.

ముఖ్యంగా యువతపై కేసు నమోదు అయితే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు,ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి పొందుటలో సమస్యలు వస్తాయని యువత గమనించగలరని, మద్యానికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని,బహిరంగంగా మద్యం తాగవద్దని, వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు,పెట్రోలింగ్ నిర్వహిస్తామని,మఫ్టీ టీమ్స్,టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసినామని,సీసీ కెమరాలు పర్యవేక్షణ ఉంటుందన్నారు.అక్రమ సిట్టింగులు,ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరగడం లాంటి వాటిని ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు.

Drunk And Driving Is Danger SP Rahul Hegde, Drunk And Driving , SP Rahul Hegde,

మద్యం దుకాణాలు యజమానులు సమయపాలన పాటించాలని,ఆర్కెస్ట్రా, డిజేలు,మైకులు ఉపయోగించడం, బాణసంచా పేల్చడం నిషేధమని,నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు.డిసెంబర్ 31 రోజున దుకాణ యజమానులులు పుడ్ మరియు డ్రింక్స్ కు వినియోగదారుల నుండి ఎక్కువగా డబ్బులు వసూళ్ళు చేయకూడదన్నారు.

అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News