సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌( Produced by Dr.Baba Saheb ) అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కొనియాడారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఎంపీటీసీ సభ్యులు పందిల్లా నాగరాణి పర్షరాములు గౌడ్, ఎనుగందుల అనసూయ నర్సింలు , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి అంబేద్కర్ నగర్ అధ్యక్షులు కర్రెల్లా ఎల్లయ్య దళిత సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా బుధవారం ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు.ఆయన రాసిన రాజ్యాంగం వల్లే భారత దేశంలో పరిపాలన విధానం నడుస్తుందన్నారు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం జరిగిందని ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Dr. Baba Saheb Ambedkar Was The Pioneer Of Reforms , Produced By Dr. Baba Saheb,

బడుగు బలహీన వర్గాలకు చెందిన యువత విద్యావంతులు కావాలి వ్యవస్థను అర్థం చేసుకుని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో తలెత్తుకుని జీవించే విధంగా కుల మతాలలో అసమానతలు తొలిగి సమానత్వం రావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రహ్మాస్త్రం లాంటి రాజ్యాంగాన్ని రాశారని ఆయన గుర్తు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అస్సన్ బాయ్, మేగి నరసయ్య , మద్దుల బాలయ్య , చందనం శివ , సల్మాన్ ఖాన్ , దళిత సంఘాల నాయకులు బాయి కాడి రాజయ్య, ఎలగందుల భూమయ్య ,ఎలగందుల బాబు, ఎలగందుల గణేష్, వెంకటేష్ , కనకరాజు, ఊషి మోషి , ఎరుపుల మహేష్ , భక్కి అనిల్ తదితరులు పాల్గొన్నారు.మండలంలో పలుచోట్ల వివిధ పార్టీల నాయకులు దళిత సంఘాల నాయకులు ఆయన విగ్రహాలకు , చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News