ఈ సీసీ రోడ్లు మాకొద్దు...!

నల్లగొండ జిల్లా:పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా వేస్తున్న సిసి రోడ్లను తక్షణమే నిలుపుదల చేయాలని మండల కేంద్రానికి చెందిన ధర్మాపురం నగేష్ ( Dharmapuram Nagesh )డిమాండ్ చేశారు.

శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో కాంట్రాక్టర్, అధికారులు,గ్రామ సర్పంచ్ కుమ్మక్కై నాణ్యత లేకుండా,ప్రభుత్వ నిబంధనలకు పాటించకుండా నూతనంగా వేస్తున్న సీసీ రసిసి రోడ్లను వేస్తున్నారని ఆరోపించారు.నిబంధనల ప్రకారం వేయకుండా కాంట్రాక్టర్ స్వలాభం కోసం ఇరువైపులా ఒక మీటరు తగ్గిస్తూ నాలుగు ఫీట్ల వెడల్పుతో రోడ్డులను వేస్తున్నారని,తక్షణమే వాటిని ఆపేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య,రాంబాబు, పురుషోత్తం,శివ,శోభన్ తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో : గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన గ్యాంగ్..
Advertisement

Latest Suryapet News