స్నానం చేసేట‌ప్పుడు ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంద‌ట‌..

ఏ సీజన్‌లో అయినా కొందరు చన్నీటితో స్నానం అనగానే వామ్మో.చన్నీళ్లా అంటూ పారిపోతారు.

చిన్న పిల్లలైతే అసలే స్నానం చేయమని మారం చేస్తుంటారు.కానీ వేడితో కంటే చల్లని నీటితో స్నానం చేసినపుడు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.చల్లని నీటితో స్నానం చేయడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంటున్నారు.

రక్త సరఫరా కూడా సాఫీగా సాగుతుందని సెలవిచ్చారు.అంతేకాకుండా కాంతివంతమైన చర్మం, ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చట.

చన్నీళ్లు అసలే అలవాటు లేని వారు మొదట వేడి నీటితో బాత్ చేశాక చివర్లో రెండు నుంచి మూడు జగ్గులు లేదా 30 సెకన్ల పాటు చల్లని నీటిని తలపై నుంచి పోసుకోవాలి.ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమట.

చల్లనీరు శీరీరంపై పోసుకున్నప్పుడు అధిక సంఖ్యలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయట.దీనిద్వారా ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకితే దానితో పోరాడేందుకు మన శరీరం అన్ని రకాలుగా సిద్దంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వేడి నీటితో తరచుగా స్నానం చేస్తే చర్మం పొడిబారే అవకాశం ఉంటుందట.అంతేకాకుండా చల్లని నీరు స్కిన్‌లోని నర్వ్ సిస్టాన్ని వెంటనే మేల్కొలుపుతాయి.

తలపై పైన చల్లని వాటర్ పోసిన క్రమంలో మెదడు ఉత్తేజితమై రోజుంతా యాక్టివ్‌గా పనిచేస్తుంది.డిప్రెషన్ వంటివి కూడా మనకు దరిచేరవని వైద్య నిపుణులు మిచెల్ గ్రీన్ స్పష్టంచేశారు.

చన్నీటితో స్నానం చేస్తే బాడీకి షాక్‌ తగిలినట్లు అవుతుందట.దీంతో నరాలు కూడా ఉత్తేజితమై రోజంతా యాక్టివ్‌గా ఉంటారట.

చాలా మందికి ఈరోజుల్లో గ్రే హెయిర్, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు అధికమయ్యాయి.చదువుకునే విద్యార్థులతో పాటు జాబ్ చేస్తున్న ఉద్యోగులకు 20 ఏళ్లలోపే జుట్టు రాలిపోవడం, గ్రేహెయిర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.దీనికి కారణం నాసిరకం షాంపుతో పాటు వేడి నీరు కూడా కారణం కావొచ్చట.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వేడి నీళ్లతో తలపై నంచి స్నానం చేస్తే జుట్టు మెరిసే గుణాన్ని కోల్పోతుంది.తద్వారా జుట్టు పలుచబడి రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.పొడి చర్మం బారిన పడకుండా ఉండాలంటే చన్నీళ్లే చాలా బెటరని వైద్యులు సూచిస్తున్నారు.

వేడినీటితో తరచూ స్నానం చేసే వారికంటే చన్నీళ్లతో చేసే వారే ధృడంగా ఉండటంతో పాటు అనారోగ్యం బారిన తక్కువ పడుతారట.

తాజా వార్తలు