1.తెలుగు వైద్యుడికి ప్రతిష్టాత్మక అవార్డు

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడు పి.రఘురాం కు ప్రతిష్టాత్మక యూకే అత్యున్నత పురస్కారం ‘ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ – 2021 ను అందుకున్నారు.
2.మరో ఇద్దరు భారతీయ అమెరికన్ల కు కీలక పదవులు
భారత సంతతికి చెందిన పౌర హక్కుల న్యాయవాది కల్పనా కోటగల్ , సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ వినయ్ సింగ్ లకు కీలకమైన అడ్మినిస్ట్రేషన్ పదవులకు నామినేటెడ్ చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించారు.
3.బిచ్చగాళ్ల ను అరికట్టేందుకు సౌదీ సరికొత్త వ్యూహం

సౌదీలో బిచ్చగాళ్ల ను అరికట్టేందుకు సౌదీ సరికొత్త వ్యూహం ను అమలు చేస్తోంది.ఈ మేరకు సోషల్ మీడియా ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.
4.ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
యూఏఈ నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.యూఏఈ నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు పూర్తి స్థాయిలో కోవిడ్ వాక్సిన్ తీసుకున్నట్లయితే ప్రయాణానికి ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోనవసరం లేదని ప్రకటించింది.
5.వలసదారులకు కువైట్ శుభవార్త

వలసదారులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఎవరైనా వలసదారులు ఆరునెలలు కంటే ఎక్కువ కాలం బయట ఉన్నప్పటికీ వారి రెసిడెన్సీ వీసా రద్దు చేయబోమని ప్రకటించింది.అయితే డొమెస్టిక్ వీసాదారులకు మాత్రం ఈ అవకాశం లేదని పేర్కొంది.
6.శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా దిగజారిన నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం,, ఆహార పదార్థాల కొరత , విద్యుత్ కోతలతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు.దీంతో శ్రీలంక లో ఎమర్జెన్సీ విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే నిర్ణయం తీసుకున్నారు.
7.కరోనా మరణాల్లో ఇండియానే టాప్
కరోనా మరణాల్లో ఇండియానే టాప్ పొజిషన్ లో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.
8.తుర్క్ మెనిస్తాన్ లో భారత రాష్ట్రపతి పర్యటన

భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తుర్క్ మెనిస్తాన్ పర్యటనలో ఉన్నారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఆయన తుర్క్ మెనిస్తాన్ చేరుకున్నారు.
9.భారత్ పై పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ క్యామర్ జావేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్ తో వివాదం పెట్టుకునే కంటే చర్చల ద్వారా సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పే విధంగా చేయడమే పాకిస్తాన్ కు మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.
.






