బావ బావమరిది సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సుమన్ హీరోగా చాలా సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అప్పట్లో సుమన్ చూడడానికి కూడా చాలా అందంగా ఉండేవాడు అలా సుమన్ తెలుగు ఇండస్ట్రీ లో హీరో అంటే వాటికీ తగ్గ క్వాలిటీస్ తో హీరో అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేవాడు.

 Do You Know Who Is The Star Hero Who Missed The Movie Bava Bavamaridi , Bava Bav-TeluguStop.com

అయితే సుమన్ కెరియర్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నప్పటికీ బావ బావమరిది సినిమా మాత్రం తనకి చాలా స్పెషల్ సినిమా అనే చెప్పాలి ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద విరాజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో హీరోగా మొదట వేరే హీరోని అనుకున్నారు కానీ సుమన్ ఒకసారి ఈ క్యారెక్టర్ చేసిన తరువాత ఇక వేరే వాళ్ళు ఆ క్యారెక్టర్ చేసిన అంత బాగా సెట్ అయ్యేది కాదు అని జనాలు అనుకునే స్థాయి లో ఈ సినిమా ఉందంటే సుమన్ తన నటన తో ఎంతలా జనాలని ఆకట్టుకున్నాడో తెలుసుకోవచ్చు.

Telugu Balakrishna, Bava Bavamaridi, Suman, Tollywood-Telugu Top Posts

అయితే ఈ సినిమా లో మొదట బాలయ్య బాబు ని హీరోగా తీసుకుందాం అని అనుకున్నారట కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ బావ దగ్గర వినయంగా చేతులు కట్టుకొని నిలబడే క్యారెక్టర్ కాబట్టి బాలయ్య ఇమేజ్ కి సరిపోదు అని బాలయ్య ఈ సినిమాని రిజెక్ట్ చేసాడు అని తెలుస్తుంది ఎందుకంటే అప్పుడే బాలయ్య రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి పెద్ద హిట్ కొట్టి మాస్ హీరోగా చాలా పెద్ద ఎత్తున ఉన్న సమయంలో వచ్చిన సినిమా కావడం వల్ల,అలాగే బాలయ్య ఫ్యాన్స్ కూడా బాలయ్య ని అలా చూడలేరు కాబట్టి బాలయ్య ఈ సినిమా వదులుకోవాల్సి వచ్చింది.

 Do You Know Who Is The Star Hero Who Missed The Movie Bava Bavamaridi , Bava Bav-TeluguStop.com

Telugu Balakrishna, Bava Bavamaridi, Suman, Tollywood-Telugu Top Posts

అలా బాలయ్య కాదనడం తో సుమన్ ఈ సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టాడు ఆ తర్వాత కూడా మంచి హిట్ సినిమాలు సుమన్ కి వచ్చినప్పటికీ ఈ సినిమానే సుమన్ కెరియర్ లో పడిన పెద్ద హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు…ప్రస్తుతం సుమన్ చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరిపోయి తెలుగు లో చాలా మంచి సినిమాలు చేస్తున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube