కమెడియన్ సునీల్ ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి పనులు చేసేవారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం హీరోగా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించిన నటుడు సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఎలాంటి వారినైనా తన కామెడీ డైలాగులతో ఇట్టే నవ్వించే సత్తా ఉన్నటువంటి సునీల్ కొన్ని రోజులపాటు హీరోగా కొనసాగిన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

 Do You Know What Kind Of Work Comedian Sunil Used To Do Before Entering The Indu-TeluguStop.com

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సునీల్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు అనే విషయానికి వస్తే…

సునీల్ భీమవరం దగ్గర పెద్దపల్లి గ్రామంలో 1974 ఫిబ్రవరి 28న జన్మించారు.సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ.

ఈయన తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు అయితే ఈయన ఐదు సంవత్సరాల వయసులో ఉండగానే తన తండ్రి మరణించడంతో ఆ ఉద్యోగం తన తల్లికి ఇచ్చారు.ఇలా తండ్రి లేకపోవడంతో సునీల్ తన తల్లితో కలిసి అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి పెరిగి పెద్దయ్యారు.

ఇక నాలుగో తరగతి వరకు అమ్మమ్మ ఊరిలో చదివిన నాలుగు నుంచి ఇంటర్ వరకు భీమవరంలో చదివారు.భీమవరం కాలేజీలో ఫిలిం ఆర్ట్స్ కోర్సులో చేరాడు.

Telugu Bhimavaram, Sunil, Murali, Sunil Verma, Trivikram-Movie

సినిమాలపై ఆసక్తితో సునీల్ తరచూ తన స్నేహితులతో కలిసి సినిమాలు చూస్తూ అప్పుడే ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు చేయకుండా చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తి ఉండడంతో చదువు పూర్తి కాగానే అవకాశాల కోసం తన స్నేహితుడు త్రివిక్రమ్ మురళితో కలిసి హైదరాబాద్లో ఒక రూమ్ లో ఉంటూ సినీ ప్రయత్నాలు చేశారు.అయితే ఈయనకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో తిరిగి భీమవరం వెళ్లిపోయారు అయితే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో చిన్న పాత్ర చేశాడు.నువ్వు నేను సినిమాకు హాస్యనటుడిగా సునీల్ నంది అవార్డును అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube