సాధారణంగా కార్తీకమాసం మొదలవగానే ఎంతోమంది భక్తులు వారి ఇష్టదైవమైన స్వామివారికి మాల ధరించి స్వామివారి సేవలో నిమగ్నమవుతారు.ఈ క్రమంలోనే కార్తీక మాసంలో ఎంతో మంది అయ్యప్ప మాలలు శివమాలలు ధరిస్తూ ఉంటారు.
ఇక కార్తీకమాసంలో ఎక్కువగా మనకు అయ్యప్పస్వామి భక్తులు కనబడుతూ వుంటారు.అయ్యప్ప మాలను ఎంతో నియమ నిష్టలతో ధరించాల్సి ఉంటుంది.
అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు కఠిన నియమాలను పాటిస్తూ నిత్యం స్వామివారి సేవలో ఉంటారు.
ఇకపోతే అయ్యప్ప మాల ధరించిన వారు 41 రోజుల పాటు దీక్ష పాటిస్తూ 18 కొండలపై 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం మాల నుంచి విముక్తి పొందుతారు.
ఇలా అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చే భక్తులు 41 రోజులు దీక్షతో ఇరుముడి కట్టుకొని స్వామివారికి చెల్లిస్తారు.ఇలా కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు మాల ధరించి సంక్రాంతి వరకు నియమ నిష్టలతో ఉండి మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు.
ఇకపోతే అయ్యప్ప మాల ధరించిన వారు ఎందుకు నలుపు రంగు దుస్తులను ధరిస్తారు అనే విషయం గురించి చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి.మరి అయ్యప్ప మాల ధరించిన వారు నలుపు రంగు దుస్తులను ధరించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే అయ్యప్ప మాల చలికాలంలో వేయడం వల్ల నలుపురంగు శరీరానికి వేడిని కలిగిస్తుంది అందుకోసమే ఈ చలి తీవ్రత నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం అయ్యప్ప మాల ధరించే వారు నలుపు దుస్తులను ధరిస్తారు.ఇక స్వామివారి దర్శనం కోసం అడవుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది కనుక క్రూర జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నలుపు రంగు దుస్తులను ధరిస్తున్నారు.
LATEST NEWS - TELUGU