130 మంది విద్యార్థులను చితక్కొట్టిన వార్డెన్ ! కారణం ఏంటో తెలుసా ..?

స్కూళ్లలో కాలేజీల్లో క్రమశిక్షణ అనే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.ముందు క్రమశిక్షణ … ఆ తరువాత ఇంకేదైనా అన్నట్టుగా ….

 School Warden Beats Children At Nagarkurnool-TeluguStop.com

కార్పొరేట్ కాలేజీలు ప్రవర్తిస్తుంటాయి.ఈ విషయంలో కఠినంగా ఉండవచ్చు కానీ మితిమీరిన క్రమశిక్షణ ఉంటే ఆ తరువాత వాటి యాజమాన్యమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.తాజాగా… నాగర్‌ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలోని కేకే రెడ్డి స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది.

క్రమశిక్షణ పేరుతో స్కూల్‌ వార్డెన్‌ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.కేకే రెడ్డి స్కూల్‌లో వార్డెన్‌గా పనిచేస్తున్న రవీందర్‌.బాత్రూమ్‌లో నీళ్లు పోయలేదన్న కోపంతో 130 మంది విద్యార్థులను ఇష్టానుసారంగా చితకబాదాడు.

ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని నాగర్‌ కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.మిగిలిన విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ఈ ఘటనకు కారణం అయిన వార్డెన్ రవీందర్‌ పరారీలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube