Akhil agent : సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న అఖిల్ ఏజెంట్.. రిలీజ్ ఎప్పుడంటే?

సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు పోటీకి దిగుతూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుంటాయి.

ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోలు సైతం పోటీకి దిగారు.

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పోటీకి దిగాయి అదే విధంగా ప్రభాస్ ఆది పురుష్ సినిమా కూడా విడుదల కానుందని ప్రకటించినప్పటికీ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు.ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు కూడా సంక్రాంతి బరిలోనే రానుంది.

ఇలా ఈ అగ్ర హీరోలు అందరూ పోటీ పడుతున్న నేపథ్యంలో యంగ్ హీరో అఖిల్ సైతం సంక్రాంతి బరిలో వస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఏజెంట్ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారంటూ ప్రకటించారు.

అయితే ఈ సినిమా గురించి సరైన అప్డేట్స్ ఇవ్వకపోయినప్పటికీ అఖిల్ సినిమా సంక్రాంతికి వస్తుందని తెలియడంతో ఈ పోటీ మధ్యన అఖిల్ సినిమా నిలబడుతుందా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.

Advertisement

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కాస్త షూటింగ్ పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండటం వల్ల ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయడం లేదని సంక్రాంతి రేస్ నుంచి ఏజెంట్ తప్పుకుందని తెలుస్తోంది.సినిమా షూటింగ్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయిన తరువాత ఈ సినిమాని వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు