నాటు నాటు నాటు పాట‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి వ్య‌క్తిగ‌త వివ‌రాలివే...

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఆర్ఆర్ఆర్ సినిమా భార‌తదేశానికే ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చారిత్రక విజయంతో భారతీయులంతా గర్వపడేలా చేసింది.

 Keeravani, Who Gained Worldwide Attention With The Song Natu Natu Natu, Golden G-TeluguStop.com

ఇక ఎం.ఎం.కీరవాణి స్వ‌ర‌ప‌రిచిన‌ ‘నాటు నాటు‘ పాట కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డు వచ్చింది.ఈ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.

అవార్డ్ షోలో కీరవాణి తన భార్య శ్రీవల్లి, రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి హాజరయ్యారు.

మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారుఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు నగరంలో జూలై 4, 1961న జన్మించిన కీరవాణి సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు.గేయ రచయిత, ప్రధానంగా తెలుగు సినిమాలో త‌న ప్ర‌తిభ‌తో ఎంతో పేరు తెచ్చుకున్నారు.

అయితే తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందించారు.

Telugu Goldenglobe, Keeravani, Mm Keeravani, Natu Natu Natu, Rajamouli, Ram Char

దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో కీరవాణి వివిధ భాషల్లో 150కి పైగా చిత్రాలకు సంగీతం స్వ‌ర‌ప‌రిచారు.జాతీయ అవార్డు కూడా అందుకున్నారు ఎంఎ కీరవాణి 1980ల చివరలో సంగీత స్వరకర్తగా త‌న వ్యాప‌కాన్ని ప్రారంభించారు.అయితే కీర‌వాణి 1990లో మన‌సు- మమత చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.

ఆ తర్వాత అతను ఇక వెనుదిరిగి చూడలేదు.క్షణ క్షణం, అన్నమయ్య చిత్రాలకు హృదయానికి హత్తుకునే సంగీతాన్ని అందించారు.

ఇందుకుగాను కీర‌వాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు.

Telugu Goldenglobe, Keeravani, Mm Keeravani, Natu Natu Natu, Rajamouli, Ram Char

1991లో అళగన్ చిత్రానికి గాను కీరవాణి ఉత్తమ సంగీత దర్శకునిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.బాహుబలి చిత్రాలలో స్వరకర్తగా నంది అవార్డులు మరియు సైమా అవార్డులను గెలుచుకున్నారు.కీర‌వాణి.

జఖ్మ్, సయా, జిస్మ్, క్రిమినల్, ఇస్ రాత్ కి సుబహ్ నహీ వంటి బాలీవుడ్ చిత్రాలకు కూడా సంగీతం అందించారు.కుటుంబంలో అందరూ ఇండస్ట్రీతో కనెక్ట్‌ అయ్యారుఎంఎం కీరవాణి.

శ్రీవల్లిని వివాహం చేసుకున్నారు, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి సోదరి.కీర‌వాణి కుమారుడు కాల భైరవ్ కూడా నేపథ్య గాయకుడు, అతను చాలా కాలం పాటు ప‌ల‌వురు అనుభవజ్ఞుల చిత్రాలలో పనిచేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube