రోజుకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్ని జబ్బులకు దూరంగా ఉండవచ్చో తెలుసా..?

బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, ఆప్రికాట్స్, అంజీర్ ఇలా డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి.

డ్రై ఫ్రూట్స్( Dry Fruits ) ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు వాటిలో పుష్కలంగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్ ద్వారా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో స‌హా అనేక‌ పోషకాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు.అందుకే రోజుకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తిన‌మ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తిన‌డం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చ‌ని అంటున్నారు.డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, పొటాషియం, క్యాల్షియం, ఎసెన్షియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి రోగనిరోధక శక్తిని( Immunity Power ) పెంచడంలో సహాయపడతాయి.డ్రై ఫ్రూట్స్ వివిధ ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా పోరాడటానికి మ‌ద్ద‌తు ఇస్తాయి.

Advertisement

అలాగే డ్రై ఫ్రూట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లు మ‌న శ‌రీరంలో క్యాన్సర్ కారక కణాల కార్యకలాపాలను నిరోధిస్తాయి.క్యాన్స‌ర్ రిస్క్ ను త‌గ్గిస్తాయి.

అధిక కొలెస్ట్రాల్ కార‌ణంగా గుండె జ‌బ్బుల( Heart Diseases ) బారిన ప‌డుతున్నవారి సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.అయితే డ్రై ఫ్రూట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.అదే స‌మ‌యంలో రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

గుండె జబ్బుల నుంచి మిమ్మ‌ల్ని ర‌క్షిస్తాయి.అలాగే డ్రై ఫ్రూట్స్ కాల్షియం, ప్రోటీన్‌ పుష్క‌లంగా ఉంటాయి.

అందువ‌ల్ల ప్ర‌తి రోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి మరియు వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టేనా... రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిన నాగబాబు!
అతని ఎవరు బయటకు గెంట లేదు... క్లారిటీ ఇచ్చిన నాగ మణికంఠ చెల్లెలు!

డ్రై ఫ్రూట్స్ శ‌రీర ఆరోగ్యాన్నే కాదు మాన‌సిక ఆరోగ్యాన్ని కూడా ప్రోత్స‌హిస్తాయి.డిప్రెషన్ మరియు ఒత్తిడిని దూరంలో చేయ‌డంలో డ్రై ఫ్రూట్స్ చాలా ప్రభావవంతంగా ఉంటాయి.ఇవి మెదడు ఆరోగ్యం మరియు జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి.

Advertisement

అంతేకాదు ప్రతినిత్యం డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల శరీర బ‌రువు అదుపులో ఉంటుంది.చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.

రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.జీర్ణం వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.

మరియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

తాజా వార్తలు