బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి( Mallareddy ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మీడియా , సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆయన ట్రెండింగ్ లో ఉండేవారు. ఇక బీఆర్ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే గెలిచిన దగ్గర నుంచి ఆయనకు రాజకీయంగా , వ్యక్తిగతంగా కష్టాలు మొదలయ్యాయి.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి అప్పట్లో విసిరిన చాలెంజ్ లు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి.
బీఆర్ఎస్ ఓటమి చెందడం , కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి టార్గెట్ అయ్యారు.దీంతో కాంగ్రెస్ లో చేరాలని ముందుగా భావించినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) రాజకీయంగాను, వ్యక్తిగతంగాను వైరం ఉండడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్ చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదు.
ఇక బిజెపిలో చేరాలని భావించినా అక్కడ అదే పరిస్థితి .ఈ క్రమంలో ఆయన రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలోచనలో పడ్డ మల్లారెడ్డికి టిడిపి ఆప్షన్ గా కనిపిస్తోంది.
గతంలో టిడిపిలో ఎంపీగా గెలిచిన అనుభవం ఉండడం , చంద్రబాబుతో( Chandrababu ) వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉండడంతో, ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్ లలో చేరాలని మల్లారెడ్డి భావిస్తున్నారట.ముందుగా మల్లారెడ్డి బిజెపిలో చేరాలని భావించనా, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చినా బిజెపి ఆయనను చేర్చుకునేందుకు ఇష్టపడలేదు.దీంతో తాను రాజకీయంగా ప్రస్థానం ప్రారంభించిన టిడిపిలోనే చేరాలని నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చారట.
దీని ద్వారా అటు బిజెపి , ఇటు కాంగ్రెస్ కు ఒకేసారి షాక్ ఇవ్వొచ్చు అని మల్లారెడ్డి అంచనా వేస్తున్నారట. తెలంగాణలో టిడిపికి పెద్దగా బలం లేకపోయినా , తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టిడిపిలో చేరడమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నారు.
తెలంగాణ టిడిపిని( Telangana TDP ) లీడ్ చేసే వారు లేకపోవడం తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకువెళ్తే తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా తానకు అవకాశం దక్కుతుంది అని , రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేయదని, ప్రస్తుతం ఏపీలో బిజెపి, టిడిపి మిత్రపక్షాలుగా ఉండడంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ పనిచేస్తుందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపిలో చేరితేనే తనకు అన్ని విధాల కలిసి వస్తుందne లెక్కల్లో మల్లారెడ్డి ఉన్నారట.