తెలంగాణ ఎన్నికలు దగ్గర పడడంతో రేస్ లో నిలిచే పార్టీలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ప్రధాన పార్టీలుగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్,( Congress ) బీజేపీ పార్టీలు ఉండగా.
వీటితో పాటు జనసేన, టీడీపీ ( Janasena TDP )వంటి పార్టీలు కూడా ఈసారి తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.ముఖ్యంగా జనసేన పార్టీ ఈసారి తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఎందుకంటే పార్టీ స్థాపించి పదేళ్ళు గడిచిన ఇప్పటివరకు ఏపీలో మాత్రమే కొనసాగుతూ వచ్చింది.తెలంగాణలో కూడా పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.
అందుకే ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేసి సత్తా చాటలని చూస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

32 స్థానాల్లో పోటీ చేసేందుకు పవన్ సిద్దమయ్యారని అందుకు సంబంధించి అన్నీ ప్రణాళికలు కూడా పూర్తయ్యాయని వార్తలు వినికిడి.అయితే బీజేపీతో జనసేన కలిసే అవకాశం ఉందని లేదంటే టీడీపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేసిన ఆశ్చర్యం లేదని ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో జనసేన సింగిల్ గా పోటీ చేస్తుందా లేదంటే పొత్తులో భాగమౌతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనసేన సింగిల్ గా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నాట్లు తెలుస్తోంది.

మరి సింగిల్ గా బరిలోకి దిగితే ప్రధాన పార్టీలకు ఎంతమేర పోటీనిస్తుందనేది ఆసక్తికరమైన అంశమే.సింగిల్ గా బరిలోకి దిగితే పార్టీ అభ్యర్థుల్లో కూడా ఆత్మవిశ్వాసం కొరవడే అవకాశం ఉంది.ఎందుకంటే తెలంగాణలో జనసేన ( Janasena )ప్రభావం తక్కువే కాబట్టి డిపాజిట్లు కూడా దక్కవెమో అనే భయం నేతల్లో ఉందట.
ఈ నేపథ్యంలో పార్టీలో జోష్ నింపెంచుకు తెలంగాణలో వారాహి యాత్ర చేపట్టేందుకు పవన్ సిద్దమౌతున్నట్లు సమాచారం.నేతల్లో ఉత్సాహాన్ని అందరి దృష్టి ఆకర్షించాలని పవన్( Pawan Kalyan ) భావిస్తున్నారట.
ఈసారి తెలంగాణలో పోటీ చేయకపోతే.జనసేన గ్రాఫ్ తెలంగాణలో పూర్తిగా పడిపోతుందని, అందుకే సీట్ల గెలుపు కోసం కాకుండా పార్టీని నిలిపేందుకు పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారట.
మరి పవన్ ఆశిస్తున్నట్లుగా తెలంగాణలో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.