ప్రజలకు జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి

సూర్యాపేట జిల్లా:తుఫాను ప్రభావం వల్ల విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని,నీటి ప్రవాహంలోకి దిగవద్దని,కరెంట్ స్తంభాలు,తీగలు పట్టుకోవద్దని, వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు,కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దూర ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోవాలని వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని,పిల్లలు,వృద్ధుల పట్ల జాగ్రత వహించాలని కోరారు.స్కూల్ బస్సులు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలని,శిథిలావస్థలో ఉండే నివాసాల్లో ఉండకూడదని,అత్యవసర సమయాల్లో పోలీసు సేవలను ఉపయోగించుకోవడానికి డయల్ 100కు,జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ 8331940806 ఫోన్ చేసి పోలీసు సేవలు పొందవచ్చని ఎస్పీ తెలిపారు.

District Police's Appeal To The Public-ప్రజలకు జిల్ల
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News