Suryapet : మునగాల జడ్పీటిసిపై అనర్హత వేటు…!

మునగాల జడ్పిటిసి నల్లపాటి ప్రమీల( Nallapati Prameela )పై ప్రత్యర్ధి దేశిరెడ్డి జ్యోతి వేసిన అనర్హత పిటిషన్ పై హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు.

ప్రస్తుతం జెడ్పీటీసీగా కొనసాగుతున్న నల్లపాటి ప్రమీల పోటీకి అనర్హురాలని,ఆమె ప్రత్యర్థి జెడ్పిటిసి అభ్యర్థి దేశిరెడ్డి జ్యోతి(సిపిఎం)ను( Desireddy Jyothi ) జడ్పిటిసిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను శుక్రవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియాకు విడుదల చేశారు.అనంతరం సిపిఎం జిల్లా నాయకులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ చట్టానికి ఎవరూ చుట్టం కాదని,తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని,ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా సరే చివరికి అన్యాయం గెలిచిందన్నారు.

Suryapet : మునగాల జడ్పీటిసిపై అనర్హ�

నూతన జడ్పిటిసి జ్యోతి మాట్లాడుతూ తక్కువ సమయం ఉన్నా గ్రామాల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై( Pending Problems )ఫోకస్ చేసి,వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News