డైరెక్టర్ అవ్వడం కోసం అబద్దాలు చెప్పాను.. నాటకాలు ఆడాను : వర్మ

రాంగోపాల్ వర్మ. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే.

 Director Ram Gopal Varma About His First Direction Chance Details, Ram Gopal Var-TeluguStop.com

సినిమా దర్శకుడిగా క్రమంలో ఆయన చేయని పని లేదు, చెప్పని అబద్ధము లేదు.శివ సినిమా మొదటిగా తీయడానికి ముందు ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి.

అమీర్పేట్ లో ఆడియో క్యాసెట్ షాప్ నడిపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అరెస్టయి ఒక రాత్రంతా ఉండి బయటకు వచ్చాక మళ్లీ సినిమా పిచ్చి పట్టుకొని తండ్రి చెప్పిన ఒక మాటతో తన ప్రయాణం కొనసాగించాడు.

అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు కొత్త అసిస్టెంట్ దర్శకుల కోసం చూస్తున్నారు అని తన తండ్రి ఒక మాట చెప్తే ఆ మాట పట్టుకుని వెంకట్ గారి కోసం అపాయింట్మెంట్ సంపాదించాడు.

అయితే అక్కినేని వెంకట్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.ఆ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ ని చూస్తున్నారట.అయితే వర్మ అప్పటికే రాసుకున్న ఒక కథను వెంకట్ కి వినిపించాడట.

Telugu Akkineni Venkat, Raghavendra Rao, Ram Gopal Varma, Nagarjuna, Rgv Chance,

అది ఏమాత్రం బాగోలేదని ఆయన రిజెక్ట్ చేయగా అప్పటికప్పుడే తన కాలేజీలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను, తన జీవితంలో జరిగిన విషయాలను జోడించి శివ కథ చెప్పాడట.రాఘవేంద్రరావు దగ్గరికి శివ కథ పట్టుకుని వర్మను తీసుకొని వెంకట వెల్లగా ఈ సినిమా వర్కౌట్ కాదని ఆయన చెప్పారట.అయితే మళ్లీ అప్పటికప్పుడు ఆయన కలియుగ పాండవులు సినిమా చూసి తన కథకు మెరుగులు దిద్దుకొని నాగార్జున కోసం ఆ కథ వినిపించారట.

Telugu Akkineni Venkat, Raghavendra Rao, Ram Gopal Varma, Nagarjuna, Rgv Chance,

అయితే కథ కాస్త నచ్చి నాగార్జున చుట్టూ చేరడం, అలాగే సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు పక్కన పెట్టి అనవసరపు పనులు చేయడం, క్లాప్ బోర్డులు పోగొట్టడం, కథ కంటిన్యూటీ ఫైల్స్ మిస్ చేయడం లాంటివి చేసేవాడట దాంతో నాగార్జున చెంచాగా, పనికిరాని వ్యక్తిగా అందరూ అతనిని చూసేవారట.అయినా కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి నాగార్జున చేత శివ సినిమా తీపించి హిట్టు కొట్టాడు వర్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube