ఆ తప్పు వల్లే అంజలికి ఆఫర్లు తగ్గాయా?

టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Did Anjali Get Less Offers Due To That Mistake, Anjali, Mistake, Tollywood, Less-TeluguStop.com

తన పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది.తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించింది.కానీ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం అంతా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అంజలి.

2006లో ఫోటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత ఏడాది తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక అక్కడే వరుస సినిమాలలో సెటిలైన మళ్లీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రి ఇచ్చింది.తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు రాగా మళ్ళీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక ఇటీవలే వకీల్ సాబ్ సినిమాలో నటించగా తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.ఇదిలా ఉంటే అంజలికి ఆఫర్లు తగ్గడానికి మరో కారణం ఉందట.

Telugu Anjali, Offers, Tollywood-Movie

ఎన్నోసార్లు అంజలి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వగా సక్సెస్ లు రాకపోవడానికి కారణం మాత్రం మరొకటి ఉందట.తను అతి తక్కువ సమయంలోనే సీనియర్ హీరోల సరసన నటించడంతో డిమాండ్ తగ్గిందని, అంతేకాకుండా తర్వాత చేయవలసిన హారర్ సినిమాలు కూడా ముందుగానే చేసేసిందని, ఇక అదే సమయంలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించడంతో.అలా ఒకే సమయంలో ఓకే దానిపై ఆధారపడి ఉండక తొందర పడటం వల్ల తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయని తెలుస్తుంది.

Telugu Anjali, Offers, Tollywood-Movie

ఇక ప్రస్తుతం తెలుగులో మరో సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుందట.ఇక తెలుగులోనే అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్3 సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తెలుగు లోని మరో రెండు అవకాశాలు వచ్చాయని తెలియగా ఇప్పటి వరకు ఆ సినిమాల గురించి ఎటువంటి ప్రకటనలు అందలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube