జగదీష్ రెడ్డీ.. దమ్ముంటే బహిరంగ చర్చకురా: దామోదర్ రెడ్డి సవాల్

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి సిగ్గుందా జగదీష్ రెడ్డి అంటూ సూర్యాపేట ఎమ్మెల్యేపై మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఫైర్ అయ్యారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా,మంత్రిగా ఉండి గత 10 ఏళ్లలో శివారు ప్రాంతాలను పట్టించుకోలేదని,పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు మొఖం లేక హైదరాబాద్ పారిపోయావ్ అని, ముందు సూర్యాపేట నియోజకవర్గం గురించి మాట్లాడు రాష్ట్రం గురించి కాదని,నువ్వు ఇంకా అధికారంలోనే ఉన్నా అనుకుంటున్నావా? నువ్వు,నీ అనుచరులు చేసిన అవినీతి,భూ కబ్జాలు వెలికితీస్తానని హెచ్చరించారు.

గత 10 సంవత్సరాలుగా సూర్యాపేట నియోజకవర్గాన్ని అవినీతి మాయం చేసి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని నీ గుప్పిట్లో పెట్టుకొని,నీ చెంచాలకు ప్రభుత్వ సొమ్ము ధారాదత్తం చేశావని ఆరోపించారు.

ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అవాక్కులు చవాకులు పేలడం సిగ్గుచేటని,రాష్ట్రం గురించి ప్రెస్ ముందు మాట్లాడడం కాదు.మొదట సూర్యాపేట నియోజకవర్గం గురించి మాట్లాడు గత 10 ఏళ్లలో సూర్యాపేటలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Damodar Reddy Challenge To Jagadish Reddy, Damodar Reddy,vemireddy Damodar Reddy

ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు తిరిగావు? అధికారం కోల్పోయాక హైదరాబాద్ వెళ్ళిపోయి, సూర్యాపేట నియోజకవర్గంలో ఏ ఒక్కరోజైనా ఒక్క గ్రామానికి అయినా వెళ్ళావా?సూర్యాపేట అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.మూడు పర్యాయాలు ఓటమి చెందినా నిత్యం ప్రజల తోటి ఉంటున్నానని, ఒక్కసారి అధికారం కోల్పోతేనే హైదరాబాద్ కి వెళ్లి పోయావని ఎద్దేవా చేశారు.

కొంతమంది నాయకులను కోటరీగా ఏర్పాటు చేసుకొని భూకబ్జాలు చేసిన చరిత్ర జగదీశ్ రెడ్డిదని,అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో దండుకున్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Advertisement
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News