కరోనా మహమ్మారి వలన దేశం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.అయితే కోవిడ్ ను ఎదురుకోవడానికి మొదటి దశ కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.
మళ్ళీ మార్చి 1 నుంచి దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం మొదలు కానుంది.ఈ క్రమంలోనే 27 కోట్ల మందికి ఈ రెండో దశలో కోవిడ్ టీకాలను ఇవ్వనున్నారు.
అయితే మొదటి దశలో వృద్దులకు, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాక్సిన్ వేయలేదు.కానీ ఇప్పుడు అలా కాకుండా 60 ఏళ్లకు పైబడిన వాళ్ళు, 45 ఏళ్లకు పైబడి ఉండి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఈ దశలో టీకాలను ఇవ్వనున్నారు.
ప్రభుత్వ హాస్పిటళ్లు, ఆరోగ్య కేంద్రాలతోపాటు మార్చి 1 నుంచి పౌరులు ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ కోవిడ్ టీకాలను తీసుకోవచ్చు.అయితే ఈ వ్యాక్సిన్ కి సంబంధించి కో-విన్ యాప్‌ను మొదటి దశ టీకా అప్పుడే వినియోగించారు.
మళ్ళీ శని, ఆది వారాల్లో అప్ గ్రేట్ చేసి మార్చి 1వ తేదీ ఉదయం 9 నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.వాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్న వారు ఈ యాప్ లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాతనే వారు కోవిడ్ టీకాలను వేపించుకోవాలి./br>
ఇక కో-విన్ (Co-win) యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
రిజిస్టర్ చేసుకున్నాక ఏదేని గుర్తింపు కార్డు ఒకటి రిజిస్టర్ చేసుకోవాలి.ఆ తరువాత ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ ని ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేస్తే చాలు.యాప్ లో రిజిస్టర్ అవుతుంది.
తరువాత మీరు ఎంచుకున్న హాస్పిటల్ లేదా కేంద్రానికి వెళ్లి అక్కడ మీ ఐడీ ప్రూఫ్ చూపించి కోవిడ్ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది.ఈ యాప్ ద్వారా కుటుంబంలో ఎంత మంది అయినా రిజిస్టర్ చేయవచ్చు.
గవర్నమెంట్ హాస్పిటల్ లో ఈ వ్యాక్సిన్ ఉచితంగానే వేస్తున్నారు.ఒకవేళ ప్రైవేటు హాస్పిటల్స్ లో వేయించుకోవాలంటే ఒక్క డోసుకు రూ.250 మాత్రమే చెల్లించాలి.