తెలంగాణ రాష్ట్రం లో సెకండ్ వేవ్ కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.ఒక రకంగా ప్రజల జీవితాలను కరోనా కకావికలం చేస్తుండగా, రోజుకు వేల మంది వైరస్ బారిన పడుతున్నారు.
ఇలా ఊహించని విపత్తుతో రాష్ట్రంలో అన్నింటికీ తీవ్ర కొరత ఏర్పడింది.
ఇకపోతే గడిచిన 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసుల వివరాలను ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వైరస్ బారిన పడి 18 మంది మృతి చెందారని ఆరోగ్యశాఖ తెలియచేసింది.
ఈ లెక్కలను కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రం లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 3,61,359 కి చేరుకోగా, మృతుల సంఖ్య కూడా 1856 కు చేరుకున్నటుగా అధికారులు పేర్కొంటున్నారు.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టివ్ కేసులు ఉండగ, నిన్న కరోనా బారి నుంచి 2,209 మంది కోలుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు.