కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులే టార్గెట్ గా అక్రమ వసూళ్ళు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు,విధులకు సమయానికి రాని ఉద్యోగులు, హాస్పిటల్స్ లో పనిచేసే మహిళా సిబ్బందే అతని టార్గెట్.

వారిని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడమే ప్రవృత్తిగా మార్చుకొని వేధింపులకు గురి చేయడంతో అతని ఆగడాలు భరించలేని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేందర్ తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారులను మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మహిళలను సరిగ్గా సమయానికి విధులకు హాజరుకాని వారిని టార్గెట్ చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ మానసికంగా,శారీరకంగా కోరికలు తీర్చాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అతని బాగోతం బయటపడింది.దీనితో 386,354,(A),354(C) 354(D)506,ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Contractors And Government Officials Are The Targets Of Illegal Collections, Con
నేను చచ్చిపోతా... నా బిడ్డలను కాపాడండి...పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు! 

Latest Video Uploads News