ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగింపు

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపు గౌడ కులస్తులకు ఉపాధి కల్పన కోసం ఈత చెట్ల పెంపకానికి చర్యలు ఐ.డి.

ఓ.సి.లో నిర్వహించిన కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా :గత ప్రభుత్వాలు పాటించిన ఆర్థిక విధానాల వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో నిర్వహించిన కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు 200 మంది గీత కార్మికులకు సిరిసిల్ల నియోజకవర్గంలో కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు.గీత కార్మికులు ఈత చెట్లు,తాడి చెట్లు ఎక్కి ప్రమాదాల వల్ల వైకల్యం పొందడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, దీనిని నివారించేందుకు సాంకేతికంగా ఒక కిట్ట్ ను తయారు చేసి, దానికి కాటమయ్య రక్షణ కిట్టు పేరుతో పంపిణీ చేస్తున్నామని అన్నారు.

గతంలో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ లో పర్యటించాల్సి ఉందని, ఢిల్లీలో వచ్చిన కార్యక్రమం వల్ల అప్పుడు సీఎం రావడం కుదరలేదని, వచ్చే నెలలో సీఎం రేవంత్ మన జిల్లాకు పర్యటించే అవకాశం ఉందని అన్నారు.గ్రామాలు కుల వృత్తులతో అభివృద్ధి సాధించాయని, గతంలో కూడా అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను తాము అమలు చేశామని అన్నారు.

Advertisement

బియ్యం పంపిణీ నుంచి ఉచిత విద్యుత్తు, ఫీజు రియంబర్స్మెంట్, 108 వాహనాలు, ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి ఆర్థికంగా రాష్ట్ర చాలా దెబ్బతిందని, ప్రతి నెలా వచ్చే 18 వేల కోట్ల ఆదాయంలో 6 వేల కోట్ల అప్పుల వడ్డీలకే ఖర్చు అవుతుందని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అంశంలో వెనుకాడటం లేదని అన్నారు.ఆర్థిక లీకేజీలను, ఆడంబరాలను అరికడుతూ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు.

గీత కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూములలో సామూహికంగా పెద్ద ఎత్తున ఈత చెట్లు పెంచే అవకాశాలను పరిశీలించి ఆ దిశగా చర్యలు చేపడతామని ప్రభుత్వ విప్ తెలిపారు.కాలువలకు ఇరు వైపులా ఈత చెట్లు నాటేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఈత, తాటి చెట్లను పెంచాలని అన్నారు.జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందించిన కాటమయ్య రక్షక కవచ కిట్లను వినియోగించుకోవాలని కోరారు.

పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?
మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్టులు

ఈ కార్యక్రమంలో పాల్గోనడం చాలా సంతోషమని అన్నారు.గతంలో అనేక ప్రమాదాలు జరిగేవని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం సేఫ్టీ పరికరాలను అందించడం చాలా సంతోషకరమని అన్నారు.

Advertisement

ప్రతి గీత కార్మికుడికి రక్షక కిట్ లు చేరాలని, దీనిని వారు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు.సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రాణి మాట్లాడుతూ తన చిన్నతనంలో తాటి చెట్టు పై నుంచి గీత కార్మికుడు ప్రమాదానికి గురై మరణించడం గమనించానని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం భావించి అందిస్తున్న కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ చేస్తుందని దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గాలలో 200 మంది ఎంపిక చేసిన లబ్ధిదారులకు రక్షక కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు.ఈ రక్షక కిట్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, దీని వినియోగం పై కార్మికులకు శిక్షణ సైతం అందించామని, దీనిని కార్మికులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, బీ.సి సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరీ, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News