ఎక్సైజ్ సీఐని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆబ్కారి శాఖ సీఐ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మండల యువజన అధ్యక్షుడు బానోతు రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుగులోతూ అనిల్ నాయక్.

పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న గుడుంబా ఆధారిత కుటుంబాలకు ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు.అంతేకాకుండా తమ విధుల ద్వారా ప్రజలను ప్రభుత్వాలను సరి సమానంగా పనిచేయాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాలలో మద్యం బెల్ట్ షాపులు అనధికార వ్యాపారం ఎవరు చేసినా వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు.

చిరంజీవి వీడియో లీక్ వెనక ఏపీ సర్కారు ఉద్దేశం అదేనా?
Advertisement

Latest Rajanna Sircilla News