భర్తను ఎందుకు మోసం చేశావంటూ ప్రశ్న.. ఆమె జవాబు తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొన్నటి వరకు మయోసైటీస్ వ్యాధికి( myositis ) సంబంధించిన ట్రీట్మెంట్ ను తీసుకుంటూ సినిమాలకు దూరంగా గడిపిన సమంత, ఆమె చెప్పిన విధంగా ఏడాది పూర్తవడంతో ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

 Why Did You Cheat On Your Innocent Husband Samantha Gave An Amazing Answer, Sama-TeluguStop.com

అందులో భాగంగానే ఒకవైపు ఫిట్నెస్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే మరొకవైపు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.మయోసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిగా కోలుకున్న సమంత, ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది.

ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ హాట్ ఫొటో షూట్‌లతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.అంతే కాకుండా హెల్త్‌కు సంబంధించిన టిప్స్ కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది ఈ బ్యూటీ.ఈ క్రమంలోనే తాజాగా హెల్త్‌కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేసింది.కానీ ఒక నెటిజన్ మాత్రం ఈ వీడియోకు వింత ప్రశ్న వేశాడు.ఇంతకీ ఆ నెటిజన్ ఏ ప్రశ్న వేశాడు సమంత ఏం స్పందించింది అన్న వివరాల్లోకి వెళితే.నాగచైతన్య, సమంత( Naga Chaitanya, Samantha ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట అంగరంగ వైభవంగా ఇద్దరూ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో రెండు మతాలకు సంబంధించిన ఆచారంలో వివాహం చేసుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాల చేత విడిపోయి.అభిమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు.ఇప్పటికీ వీరి ఇద్దరూ కలిసిపోతే బాగున్ను అని కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే వాళ్లు ఎందుకు విడిపోయారు అనే దానిపై ఇంక రచ్చ నడుస్తూనే ఉంది.

అయితే.తాజాగా యోగాకు సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేసింది సమంత.

అందులో తను రోజు చేసే మెడిటేషన్స్ టైమింగ్స్ గురించి చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.

అందరూ పాజిటివ్‌గా రిప్లైలు ఇచ్చారు.ఒక నెటిజన్ మాత్రం మీ అమాయకపు భర్తను ఎందుకు మోసం చేశారు అని అడిగాడు.

దాని స్పందించిన సమంత ఈ ప్రశ్న మీకు మంచిది కాకపోవచ్చు.మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి.

మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.

దీంతో బాగా బుద్ధి చెప్పారు మేడం అంటూ సమంతకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube