అంబరాన్నంటిన సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగా సంబురాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతుల వరప్రధాయిని సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగను ఆదివారం రైతులు,గ్రామస్తులు రంగ రంగ వైభవంగా నిర్వహించారు.సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగ వేడుకలు ఆదివారం ప్రారంభమై మైసమ్మ తల్లికి పటాలు నిర్వహించి సోమవారంతో ముగుస్తాయి.

 Singasamudram Katta Maisamma Festival Grand Celebrations, Singasamudram Katta Ma-TeluguStop.com

సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగా నిర్వహణ కమిటీ సభ్యులుగా ఒగ్గు బాలరాజు యాదవ్,నేవూరి శ్రీనివాస్ రెడ్డి ల ఆధ్వర్యంలో మరో పది మంది తో కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలో వివిధ వర్గాలు, రైతుల ద్వారా విరాళాలు సేకరించి మైసమ్మ పండుగా ఘనంగా నిర్వహించారు.

ఎన్నో ఏళ్ల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం సింగసముద్రం కట్ట పై గల కట్ట మైసమ్మ కు ప్రతి యేటా గ్రామం లో పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వివిధ కులాలు, ఆయకట్టు రైతుల ఆర్థిక సహాయంతో రెండు రోజుల పాటు పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా బైండ్లవారు గ్రామంలో పటం పరిచి దున్నపోతును శుద్ధ జలాలతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి, వేప ఆకులతో తయారు చేసిన దండను మెడలో వేసి పూలమాలలతో చూడ ముచ్చటగా అలంకరించి గ్రామంలోని పురవీధుల గుండా ఆటపాటలతో మైసమ్మ పోతును తిప్పుతూ, గ్రామ దేవతలందరికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం కట్ట మైసమ్మ గుడి కి వివిధ కులవృత్తుల వారు ఊరేగింపుతో చేరుకొని మైసమ్మ పండుగను రాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఘనంగా నిర్వహిస్తారు.

అనంతరం కట్ట మైసమ్మకు పటం వేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి దున్నపోతును , మేకలను కట్ట మైసమ్మ కు భలిఇస్తారు.ఈ మైసమ్మ పండుగా కార్యక్రమంలో సింగ సముద్రం ఆయకట్టు రైతులు, గ్రామస్తులు,వివిధ కుల వృత్తులవారు పాల్గొని ఘనంగా కట్ట మైసమ్మ పండుగను నిర్వహిస్తారు.

మళ్లీ వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నుండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube