టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై( Vemireddy Prashanthi Reddy ) వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి( MP Vijayasai Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్ లో అనేక విషయాలు బయటపడ్డాయన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే వ్యాపారాలు చేసుకుంటామని చెప్పారన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఇలాంటి వారిని నమ్మి ప్రజలు ఓటు వేయవద్దని సూచించారు.ఈ క్రమంలోనే ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని తెలిపారు.
అంతేకాకుండా రాష్ట్రంలోనూ మరోసారి జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.