పొత్తు కోసం ఫోర్స్ చేస్తున్నా ... బెట్టు చేస్తున్న కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )హవా కనిపిస్తోంది.  ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది.

 Congress Is Making A Bet For Alliance, Congress, Telangana Elections Brs, Bjp, A-TeluguStop.com

ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ  తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా,  కాంగ్రెస్( Congress ) కూడా మరికొద్ది రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది .పార్టీలోనే టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఒక్కో నియోజకవర్గంలో నుంచి ఇద్దరు ముగ్గురు ఉండగా , ఇటీవల బీ ఆర్ ఎస్,  బిజెపి నుంచి కొంతమంది కీలక నేతలు టికెట్ హామీతో పార్టీలో చేరారు.దీంతో ఈ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారగా,  ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు వామపక్ష పార్టీలతో పాటు చిన్నచితక పార్టీలు కాంగ్రెస్ పై ఒత్తిడి చేస్తున్నాయి.

Telugu Aicc, Congress, Telangana Brs, Telangana-Politics

పొత్తులో భాగంగా కీలకమైన స్థానాలను కోల్పోవాల్సి వస్తుందనే భయమూ కాంగ్రెస్ లో కనిపిస్తోంది.అందుకే ఒకవైపు సిపిఐ,  సిపిఎం ( CPI, CPM )పార్టీలతో పాటు, టీజేఎస్ , బీఎస్పీ వంటి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి .అయితే మొన్నటి వరకు బిఆర్ఎస్ తోనే తమ పొత్తు ఉంటుందంటూ వామపక్ష పార్టీల నేతలు ప్రకటించినా,  కేసీఆర్( KCR ) వారిని పట్టించుకోకపోవడం అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వంటివి చోటుచేసుకున్నాయి.దీంతో మరో ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్ వైపు వామపక్ష పార్టీలు వస్తున్నాయనే అభిప్రాయం కాంగ్రెస్ లో నెలకొంది.

Telugu Aicc, Congress, Telangana Brs, Telangana-Politics

దీంతో  ఇప్పుడు ఆ పార్టీలతో పొత్తుకు తాము సిద్దమని ప్రకటిస్తే కీలకమైన స్థానాలను కోల్పోవాల్సి వస్తుందని,  అలా కాకుండా ఆ పార్టీలను దూరం పెడితే వారే అరకొర సీట్లు ఇచ్చినా సరిపెట్టుకుంటారని, తమతో పొత్తు పెట్టుకుంటే చాలు అనే విధంగా ఆ పార్టీ నేతలు ముందుకు వస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కూడా ఒక మెట్టు దిగి కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆమోదిస్తే తప్ప పొత్తులు కుదిరే అవకాశం కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube